KFCలో కుళ్లిపోయిన చికెన్.. కస్టమర్స్ సీరియస్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌‌లోని కూకట్‌పల్లి (Kukatpally) అశోక్ వన్ మాల్‌ కేఎఫ్‌సీ (KFC)లో దారుణం జరిగింది. నిర్వాహకులు కస్టమర్లకు కుళ్లిపోయిన చికెన్ వడ్డించడంతో వివాదం నెలకొంది. సిబ్బందిని నిలదీయగా బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. చిన్నపిల్లలు తింటే వారి ప్రాణాలకు ఎవరు బాధ్యులని కస్టమర్ల ఆవేదన వ్యక్తం చేశారు.

కేఎఫ్‌సీ చికెన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. 11 రకాల రహస్య మూలికలు, మసాలా దినుసుల మిశ్రమంతో తయారుకావడమే ఇందుకు కారణం. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండటం ఆహార ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. కేవలం రుచి మాత్రమే కాకుండా, క్వాలిటీ బాగుండటంతో ఫుడ్ లవర్స్ ఇష్టపడుతున్నారు. అలాంటి పేరున్న కేఎఫ్‌సీలో కూడా కుళ్లిపోయిన చికెన్ వాడటం విమర్శలకు తావిస్తోంది.

Read Also: పారిశ్రామికీకరణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలి: సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>