epaper
Sunday, March 1, 2026
epaper

వాంఖడేలో రవిశాస్త్రికి అరుదైన గౌరవం

కలం, వెబ్ డెస్క్: ముంబై వాంఖడే స్టేడియంలో (Wankhede Stadium) భారత మాజీ కెప్టెన్ రవి శాస్త్రికి (Ravi Shastri) అరుదైన గౌరవం దక్కనుంది. ప్రెస్ బాక్స్ కింద ఉన్న లెవల్-1 స్టాండ్‌కు ఆయన పేరు పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ఏపెక్స్ కౌన్సిల్ (MCA) సమావేశంలో ఆమోదం లభించింది. ముంబై తరఫున దేశీయ క్రికెట్ ఆడిన రవిశాస్త్రి భారత్‌కు ఆటగాడిగా, తర్వాత కోచ్‌గా సేవలు అందించారు. ఆయన 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్‌లు ఆడారు. 2017 నుంచి 2021 వరకు జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేశారు. ఆ సమయంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా పర్యటనల్లో టెస్ట్ సిరీస్ విజయాలు కూడా సాధించింది.

ముంబై, భారత క్రికెట్‌కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం ఇస్తున్నట్లు సంఘం తెలిపింది. ఆటగాడిగా, నాయకుడిగా, కోచ్‌గా ఆయన (Wankhede Stadium) కృషిని స్మరించుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అదే సమావేశంలో స్టేడియం గేట్లకు కూడా ప్రముఖ క్రికెటర్ల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. గేట్ నంబర్ 3కు దిలీప్ సర్దేశాయ్, గేట్ నంబర్ 6కు ఏక్‌నాథ్ సోల్కర్, గేట్ నంబర్ 5కు డియానా ఎడుల్జి పేర్లు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో వాంఖడే స్టేడియంలో ముంబై క్రికెట్‌కు సేవలందించిన దిగ్గజాలకు ప్రత్యేక గుర్తింపు లభించనుంది. భవిష్యత్ తరాలకు వారి సేవలు గుర్తుండేలా ఈ నామకరణం ఉండనుంది.

Read Also: నైటుకు రేటు ఎంత అని అడుగుతారా.. ట్రోలర్లపై రేణు దేశాయ్ ఫైర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!