epaper
Sunday, March 1, 2026
epaper

ఇరాన్​ వార్ ​: స్కూల్​పై ఎయిర్​స్ట్రైక్స్​.. 40 మంది మృతి

కలం, వెబ్​ డెస్క్​: పశ్చిమాసియాలో యుద్ధం అమాయకుల ప్రాణాలను బలి తీసుకోవడం మొదలుపెట్టింది. శనివారం ఇరాన్​పై (Iran – Minab) ఇజ్రాయెల్​–అమెరికా దళాలు చేసిన దాడిలో 40 మంది మృతి చెందారు. వీళ్లలో విద్యార్థినులు 36 మంది ఉన్నారు. ఇరాన్​ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. మినాబ్​ సిటీలో ఉన్న ఐఆర్​జీసీ సైనిక స్థావరం లక్ష్యంగా ఇజ్రాయెల్​–యూఎస్ (Israel – US)​ ఈ ఉదయం ఎయిర్​స్ట్రైక్స్​ చేశాయి. అయితే, అవి ప్రయోగించిన బాంబులు గురి తప్పి ఓ ప్రాథమిక పాఠశాలపై పడ్డాయి. దీంతో 24 మంది చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరికొందరు చికిత్స పొందుతూ మరణించారు.

గాయపడినవాళ్లను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి(Iran – Minab). దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్​ మీడియాలో వైరలవుతున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​.. ఇరాన్​ ప్రజలను ఉద్దేశించి ఓ సందేశం విడుదల చేశారు. ఇరానీయులు తమ విధిరాతను మార్చుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. 1979 నుంచి సాగుతున్న ఇస్లామిక్​ నాయకత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పాలని, ఎదురించాలని పిలుపునిచ్చారు.

Read Also: ఆంధ్రప్రదేశ్​ పేరు మార్చాలి : గరికిపాటి నరసింహారావు

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!