కలం డెస్క్ : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు(Panchayat Elections) నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ఖరారు చేసింది. డిసెంబరు 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనున్నదని ఎన్నికల కమిషనర్ రాణికుముది(Rani Kumudini)ని పేర్కొన్నారు. గతంలో హైకోర్టు తీర్పు కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయని, అందుకే మరో షెడ్యూలు ఖరారు చేయాల్సి వచ్చిందన్నారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు కొనసాగుతుందని, ఆ వెంటనే కౌంటింగ్ 2.00 గంటల నుంచి మొదలవుతుందన్నారు. షెడ్యూలు ప్రకకటించడంతో వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం కోడ్ ఉండదు.
Panchayat Elections | ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కోసం ఈ నెల 27న జిల్లా ఎన్నికల అధికారులు సంబంధిత గ్రామీణ స్థానిక ఎన్నికలకు నోటీసులు జారీచేస్తారని, అదే రోజున నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. సెకండ్ ఫేజ్ పోలింగ్ కోసం నెల 30న, థర్డ్ ఫేజ్ పోలింగ్ కోసం వచ్చే నెల 3న నోటీసులు జారీ అయ్యి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుందన్నారు. మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని 1,13,534 వార్డులకు పోలింగ్ జరుగుతుందన్నారు.
Read Also: జామపండును ఇలా తింటేనే అధిక లాభాలు..!
Follow Us on : Pinterest


