కలం, వెబ్ డెస్క్: సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కొంతమంది నటీనటులకు అదృష్టం కలిసొస్తుంటుంది. హీరోయిన్ కయాదు లోహర్ (Kayadu Lohar) విషయంలో ఇదే నిజమవుతోంది. 2022లో శ్రీవిష్ణు సరసన ‘అల్లూరి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఇటీవల విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, కయాదు క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం ఈమె టాలీవుడ్ (Tollywood)లో మరో రెండు భారీ చిత్రాలకు సంతకం చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అందులో ఆమెకు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడం ఈమెకు ప్లస్ పాయింట్‌గా మారింది.
తాజా సమాచారం ప్రకారం.. కయాదు లోహర్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 1 కోటి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. వరుసగా ఆఫర్లు క్యూ కడుతుండటంతో, నిర్మాతలు ఆమె అడిగినంత ఇచ్చేందుకు వెనుకాడటం లేదు.

