epaper
Sunday, March 1, 2026
epaper

అలర్ట్.. మార్చిలో బ్యాంకులకు వరుస సెలవులు

కలం, డెస్క్ : బ్యాంకు కస్టమర్లకు అలర్ట్ న్యూస్ ఇది. ఎందుకంటే మార్చి నెలలో బ్యాంకులకు వరుస సెలవులు (Bank Holidays) రాబోతున్నాయి. దీంతో ఆయా తేదీలకు ముందే కస్టమర్లు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మార్చి 3న హోలీ పండుగ, 19న ఉగాది, 21న రంజాన్, 27న శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజుల్లో బ్యాంకులు పూర్తిగా మూసి ఉంటాయి. వీటితో పాటు రెండు, నాలుగో శనివారాల్లో కూడా బ్యాంకులు మూసి ఉంటాయి.

అలాగే ఐదు ఆదివారాలు కూడా వస్తున్నాయి. ఇలా రెగ్యులర్ సెలవులు (Bank Holidays) ఏడు కాగా నాలుగు పండుగలతో కలిపి మొత్తం 11 సెలవులు ఉంటున్నాయి. మార్చి 31న మహవీర్ జయంతి ఉన్నప్పటికీ.. ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ రోజు కాబట్టి.. ఆ రోజు అంతర్గత కార్యకలాపాలు జరుగుతాయి. ఇక బ్యాంకులు మూసి ఉన్న రోజుల్లో ఆన్ లైన్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.

Read Also: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ టార్గెట్ ఫెయిల్.. రూ.95 కోట్లు వృధా!!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!