epaper
Sunday, March 1, 2026
epaper

జేఈఈ మెయిన్ పేపర్​ 2 రిజల్ట్స్​.. సత్తా చాటిన తెలుగువాళ్లు

కలం, వెబ్​ డెస్క్​: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్​ కాలేజీల్లో ఆర్కిటెక్చర్​, ప్లానింగ్​ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ (JEE Main 2026) పేపర్​ 2 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పేపర్–​2ఏ (బీఆర్క్​)లో ఒకరు, పేపర్–​2బి(బీప్లానింగ్​)లో ఒకరు 100 పర్సంటైల్​ సాధించారు. వీళ్లిద్దరూ కేరళకు చెందినవాళ్లే కావడం విశేషం. సూర్యతేజ (బీఆర్క్​)లో, గౌరీ శంకర్​(బీప్లానింగ్​)లో వంద శాతం పర్సంటైల్​ సాధించి టాప్​ ర్యాంకులో నిలిచారు. ఇక ఈ రెండు పేపర్లలో సత్తా చాటిన తెలుగువాళ్లు ఎవరంటే…

పేపర్​–2ఏలో తెలంగాణకు చెందిన తేళ్లూరి శ్రేయస్​ రెడ్డి(99.993) జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు పొందాడు. ఆంధ్రప్రదేశ్​ నుంచి ఓరుగంటి సూర్య అశ్విన్​ (99.95) 10వ స్థానంలో నిలిచాడు. పేపర్​–2బిలో మద్దూరి నాగ ప్రద్యుమ్న రెడ్డి(తెలంగాణ– 99.990) 4వ ర్యాంక్​ సాధించగా, ఆంధ్రప్రదేశ్​కు చెందిన పైలా హర్షాదిత్య, వానపల్లి శ్రీ ఈశ్వర్​ రాజ్​, సింగంశెట్టి వెంకట భీమతులిప్​ వరుసగా 8,9,10 స్థానాల్లో నిలిచారు.

జనరల్​ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన ససనపురి తోషిణి (99.936) టాప్​ ర్యాంక్​ పొందారు. అలాగే ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల్లో ఏపీకి చెందిన కుంభా జీవన్​ సాయిరామ్​ (99.776), బలగం ఆదిత్య వీర విజయ భార్గవ్​(95.390) మొదటి స్థానంలో నిలిచారు.

ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్ (JEE Main 2026)​ పరీక్షలు జరిగాయి. ఇందులో జేఈఈ మెయిన్ పేపర్​1 ఫలితాలు ఇప్పటికే రిలీజయ్యాయి. ప్రస్తుతం విడుదలైనవి జేఈఈ మెయిన్​ పేపర్​2 పరీక్షలు. జనవరి 29న రెండు పేపర్లుగా(బీఆర్క్​–పేపర్ 2ఎ), (బీప్లానింగ్​–పేపర్​ 2బి) జరిగిన ఈ పరీక్షకు మొత్తం 1,63,671 మంది హాజరయ్యారు.

పూర్తి ఫలితాలు, అదనపు వివరాలు https://jeemain.nta.nic.in/ వెబ్​సైట్​లో చూడవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!