ఢిల్లీలో వాయు కాలుష్యం(Delhi Pollution) ప్రమాద స్థాయికి పడిపోయింది. ప్రతి రోజూ గాలి నాణ్యత అంతకంతా పడిపోతుండటం ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. ఇప్పటికే కాలుష్య నివారణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నా ఫలితం ఆశించినంతగా కనిపించడం లేదు. ఇప్పటికే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(GRAP)-3 ఆంక్షలను విధించిన ప్రభుత్వం తాజాగా ఈ ప్లాన్‌లో పలు కీలక సవరణలు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత ఇండెక్స్ 300-400 పరిధిలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీనిపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అయితే తాజాగా ఢిల్లీ కాలుష్యంపై బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) స్పందించారు. కాలుష్య నివారణకు త్వరితగతిన ఏవైనా చర్యలు తీసుకోవాలని, లేదంటే పరిస్థితులు చేయిదాటి పోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ధనుష్, కృతి(Kriti Sanon) కలిసి నటించిన ‘తేరే ఇష్క్ మే’ సినిమా ప్రమోషన్స్‌లో ఇద్దరు స్టార్ట్ చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగానే ఢిల్లీ కాలుష్యంపై కృతి స్పందించారు. కాలుష్యం గురించి ఏమైనా చెప్పడం, వ్యాఖ్యానించడం వల్ల లాభం ఉండదని తెలిపారు. రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతోందని అన్నారు. ‘‘నేను ఢిల్లీ అమ్మాయినే.. కాబట్టి గతంలో ఇక్కడ ఎలా ఉండేదో నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయ్’’ అని పేర్కొన్నారు కృతి. ఈ విషయంపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని, లేదంటే రానున్న కాలంలో పక్కన నిల్చున్న వ్యక్తిని కూడా చూడలేని పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.
Read Also: వాట్సాప్ గ్రూపుల్లోకి సైబర్ క్రిమినల్స్
Follow Us on: Youtube

