Mobile Popup Ad
Mobile Popup Ad

వాట్సాప్‌ గ్రూపుల్లోకి సైబర్ క్రిమినల్స్

కలం డెస్క్ : సైబర్ క్రిమినల్స్(Cyber Criminals) ఇప్పుడు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజలు విస్తృతంగా వాడుతున్న వాట్పాప్ గ్రూపులను హ్యాకింగ్ చేస్తున్నారు. ఆ గ్రూపుల పేర్లను తొలగించి, ప్రొఫైల్‌ను మార్చి ఎస్‌బీఐ అనే పేరు పెట్టి దాని లోగోను తగిలిస్తున్నారు. “మీ బ్యాంకు ఖాతా నుంచి ఎలాంటి లావాదేవీలు జరపకుండా ‘హోల్డ్’ చేశాం.. ఈ రోజు రాత్రికి మీ అకౌంట్ పూర్తిగా బ్లాక్ అవుతుంది… వెంటనే ఆధార్ నెంబరుతో లింక్ చేయండి.. ఇందుకోసం ఈ దిగువన ఉన్న ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి..” అంటూ మెసేజ్ పెట్టి దాని ద్వారా మొత్తం మొబైల్ ఫోన్‌ను వారి కంట్రోల్‌లోకి తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకాలం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వాడుకున్న సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లోకీ జొరబడ్డారు.

వాట్సాప్ న్యూస్ గ్రూపులు హ్యాకింగ్ :

ఒక జర్నలిస్టు వాడే నెంబర్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్ళు(Cyber Criminals) అతని ఫోన్‌లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లోకి పై మెసేజ్ పెట్టి జొరబడ్డారు. అనేక వాట్సాప్ గ్రూపుల పేర్లు, డిస్‌ప్లే పిక్చర్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుకు మార్చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే పలువురు జర్నలిస్టులు వాడే అనేక న్యూస్ వాట్సాప్ గ్రూపులు(Whatsapp Groups) నిమిషాల వ్యవధిలోనే మారిపోయాయి. జర్నలిస్టు నెంబరును, పేరును ఇందుకోసం వాడుకున్నారు. రాష్ట్రంలో పలువురు మంత్రులు మీడియా ప్రతినిధులకు అధికారిక సమాచారం ఇవ్వడానికి ఉపయోగిస్తున్న పలు వాట్సాప్ గ్రూపులు సైతం సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అనేక మంది మీడియా ప్రతినిధులు ఉండే గ్రూపుల్లో ఏం జరుగుతుందో అర్థం కాక కొద్దిసేపు అయోమయం నెలకొన్నది. ఒక జర్నలిస్టు పేరుతో ఆ గ్రూపులన్నింటా ఒకే మెసేజ్ రావడంతో మిగిలిన పాత్రికేయులు అప్రమత్తమయ్యారు.

Read Also: హోరాహరీగా సాగిన ప్రీవెడ్డింగ్ క్రికెట్.. మందనాదే విజయం..

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>