epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

డీజీపీ ఎదుట భారీగా మావోయిస్టుల లొంగుబాట్లు !

ఇటీవల మావోయిస్టుల(Maoists) లొంగుబాట్లు, లేదంటే అగ్రనేతల ఎన్ కౌంటర్లు నిత్యం కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ డీజీపీ(Telangana DGP) ఎదుట భారీగా లొంగుబాట్లు ఉన్నబోతున్నట్టు సమాచారం. లొంగిపోయేవారిలో అగ్రనేతలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. డీజీపీ ఎదుట సుమారు 30 మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. వీరిలో కీలక నేతలు, డివిజనల్ కమాండర్లు, క్యాడర్ సభ్యులు ఉన్నట్టు సమాచారం.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. మావోయిస్టు అగ్రనేతలైన కొయ్యడ సాంబయ్య, అప్పాస్‌ నారాయణ, ఎర్రాలు వంటి వారు కూడా లొంగుబాటులో ఉన్నట్టు సమాచారం. వీరంతా కీలక ఆపరేషన్లలో పాల్గొన్న మావోయిస్టులు లొంగుబాటు కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ రాష్ట్రానికి సంబంధించిన తాజా నక్సల్ కార్యకలాపాల పరిస్థితులు, లొంగుబాటు నేపథ్యంలో చేపట్టబోయే పునరావాస చర్యలపై వివరాలు వెల్లడించనున్నారు.

తెలంగాణలో మావోయిస్టు ప్రభావం గత కొన్నేళ్లుగా గణనీయంగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. పోలీసుల కమ్యూనిటీ రీచ్ ప్రోగ్రాంలు, సుస్థిర భద్రతా చర్యలు, అడవుల్లో విస్తృత పరిశీలనల వల్ల మావోయిస్టులకు ఆశ్రయం తగ్గిపోవడమే కాకుండా, వారి నియామకాలు కూడా తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి 30 మంది లొంగుబాటు చేయడం రాష్ట్రంలో శాంతి-భద్రతా వ్యవస్థకు మరింత బలం చేకూర్చే పరిణామంగా భావిస్తున్నారు.

లొంగిపోయే మావోయిస్టులకు(Maoists) ప్రభుత్వం పునరావాసం, ఉపాధి అవకాశాలు, భద్రత విషయాల్లో సహాయాన్ని అందించనుంది. ఈ కార్యక్రమం ద్వారా మరింత మంది ప్రధాన ప్రవాహంలోకి రావడానికి ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం అని పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు.

Read Also: మణిపూర్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>