కలం, వెబ్‌డెస్క్: జేఈఈ మెయిన్ (JEE Mains 2026) 2026 సెషన్ 1లోని పేపర్ 1 (బీఈ/బీటెక్) కు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి 100 పర్సంటైల్ 12 మంది సాధించారు. ఇందులో తెలుగువాళ్లు ముగ్గురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్‌తోపాటు తెలంగాణకు చెందిన వివాన్ శరద్ మహిశ్వరి హండ్రెడ్ పర్సంటైల్ సాధించారు. జాతీయ స్థాయిలో మహిత్ రెండో స్థానం, మోహిత్ తొమ్మిదవ, శరద్ మహిశ్వరి 12 స్థానం పొందారు. మొదటి ర్యాంక్‌ను ఢిల్లీకి చెందిన శ్రేయస్ మిశ్రా పొందారు. ఓబీసీ–ఎన్సీఎల్ కేటగిరీలో మోహిత్ టాప్ ర్యాంక్ సాధించారు. ఎస్సీ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దేవ శ్రీవేద్ 99.999 పర్సంటైల్‌తో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం పొందారు. హండ్రెడ్ పర్సంటైల్ పొందినవాళ్లలో అమ్మాయిలు ఒక్కరూ లేకపోవడం గమనార్హం.
దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఎన్ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్ఐటీల్లో బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కోసం జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జేఈఈ మెయిన్ 1 పరీక్ష నిర్వహించింది. వీటికి సంబంధించిన ఫైనల్ కీని ఈరోజు ఉదయం విడుదల చేసిన ఎన్టీఏ.. ఫలితాలను సాయంత్రం రిలీజ్ చేసింది. కాగా, జనవరి 29న నిర్వహించిన పేపర్ 2 పరీక్ష ఫలితాలను త్వరలో రిలీజ్ చేస్తారు.
ఈ ఏడాది పేపర్1 పరీక్షకు 13,55,293 మంది దరఖాస్తు చేసుకున్నారు. 13,04,653 మంది(96.26%) మంది ఎగ్జామ్‌కు హాజరయ్యారు.
Read Also: బెంగుళూరులో ఏఐ ఆంథ్రోపిక్ ఆఫీస్.. ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్
Follow Us On: X(Twitter)


