epaper
Friday, January 16, 2026
spot_img
epaper

తేడా వస్తే అంతా మూసేస్తాం.. హైడ్రాకు హైకోర్ట్ వార్నింగ్

హైడ్రా(Hydraa)కు హైకోర్టులో భారీ షాక్ తగిలింది. నిబంధనలను అతిక్రమిస్తే మొత్తంగా హైడ్రా కార్యకలాపాలనే ఆపేస్తామంటూ ఉన్నతన్యాయస్థానం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతల వ్యవహారంలో హైకోర్టు(High Court) ఈ వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా నిబంధనలను పాటిస్తామని, అవి తమకు వర్తించవన్నట్లు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. నీటి వనరులు, నాలాలకు సంబంధించినవి తప్ప.. ఇతర విషయాల్లో చట్టపరమైన నిబంధనలను అతిక్రమిస్తే హైడ్రా కార్యకలాపాల్ని పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించింది.

గచ్చిబౌలి(Gachibowli)లో తమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడాన్ని సంధ్య గ్రూప్ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఈమేరకు సంధ్య గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి విచారించారు. ఈ విచారణలో భాగంగానే హైడ్రాకు వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగానే అసలు ఉదయాన్నే కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి నిలదీశారు. అంతేకాకుండా ఆక్రమణల పరిధిని హైడ్రా ఎలా నిర్ణయిస్తుంది? అందుకు వారు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు? వంటి విషయాలు చెప్పాలని కోరారు. హైడ్రా చర్యలకి చట్టపరమైన స్పష్టత లేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకు సంబంధించి వచ్చే ప్రతి కేసులోనూ కొత్త నిబంధన, వాదన తెస్తారని అసహనం వ్యక్తం చేశారు.

హైడ్రా(Hydraa) తన విధానాలను అధికారికం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అసలు ఈ సంస్థ ఏ చట్టం కింద పని చేస్తుందో చెప్పాలని కోరారు. ఈకేసులో తదుపరి చర్యలు తీసుకోవడానికి ముందు హైడ్రా అధికారాల పరిధిపై వివరణాత్మక న్యాయ పరిశీలన అవసరమని ఆయన తెలిపారు.

Read Also: పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్… కాంగ్రెస్ కీలక నిర్ణయం

Follow Us on : ShareChat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>