epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గిల్ ఔట్.. పంత్‌కు భారత్ సారథ్య బాధ్యతలు..!

టీమిండియా సారథ్య బాధ్యతలు పంత్‌(Rishabh Pant)కు అందాయి. గాయం కారణంగా టీమిండియా నుంచి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌కు ముందు గిల్‌కు గాయమైంది. దాంతో అతడు జట్టు నుంచి వైదొలిగాడు. నవంబర్ 22(శనివారం) నుంచి గౌహతి వేదికగా టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ గౌహతి(Guwahati) నుంచి ముంబైకి పయనమయ్యాడు. కానీ అతడి గాయం ఇంకా నయం కాకపోవడంతో అతడు జట్టు నుంచి వైదొలిగాడు. దీంతో అతడి స్థానంలో జట్టు పగ్గాలను పంత్ చేతికి అందనున్నట్లు తెలుస్తోంది.

శుభ్‌మన్ గిల్(Shubman Gill) దూరమవడంతో అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh Pant) జట్టు కెప్టెన్సీని చేపట్టనున్నారు. అయితే తుది జట్టు ఎంపిక చేయడంలో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు మేనేజ్‌మెంట్‌కు కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో సాయి సుదర్శన్ లేదా నితీష్ కుమార్ రెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. అదనపు స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను బెంచ్‌కే పరిమితం చేసే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ముందు జరిగిన నెట్ ప్రాక్టీస్‌లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ మాత్రమే పాల్గొన్నారు. గిల్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని టెస్ట్‌లో ఆడాలనుకున్నప్పటికీ, జట్టు యాజమాన్యం అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు.

Read Also: IPL మినీ వేలాన్ని ఆపేయండి: ఊతప్ప

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>