epaper
Wednesday, February 18, 2026
epaper

దోపిడి అరికట్టడానికే సీపీఐకి మద్దతు ఇస్తామన్నాం : కేటీఆర్​

కలం, వెబ్​ డెస్క్​ : సింగరేణిలో కాంగ్రెస్​ దోపిడిని అరికట్టడానికి కొత్తగూడెం కార్పొరేషన్  (Kothagudem Corporation)లో సీపీఐకి మద్దతు ఇస్తామని చెప్పినట్లు బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR) తెలిపారు. తెలంగాణ భవన్‌లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో జరుగుతున్న దోపిడిని అడ్డుకోవడమే తమ లక్ష్యమని కేటీఆర్​ స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు కలిసి సింగరేణిని నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. సీపీఐ, కాంగ్రెస్​ లు ఇప్పటికే పొత్తులో ఉన్నాయని కొత్తగూడెం మేయర్​ పదవిని పంచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు.

అయితే, ఏఐటీయూసీ వంటి సీపీఐకి (CPI) అనుబంధ సంస్థ అలయన్స్​ ను ఎందుకు అంగీకరించిందో తెలియదన్నారు. దాని వెనుక ఏ ఒత్తిళ్లు పని చేశాయోనని కేటీఆర్​ అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాలు, హక్కుల కోసం గతంలో ఎలా పోరాడామో భవిష్యత్తులోనూ అలాగే పోరాడుతామని ఆయన (KTR) స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు 34 చోట్ల హంగ్​ ఏర్పడితే ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్​ అరాచకాలకు పాల్పడుతూ కౌన్సిలర్లను కిడ్నాప్​ చేస్తున్నారని కేటీఆర్​ ఆరోపించారు.

Read Also: ఎన్నిక‌ల్లో ఓడిపోయా.. డ‌బ్బు, చీర‌లు తిరిగిచ్చేయండి!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>