తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ దే: మాజీ మంత్రి ఎర్రబెల్లి

కలం, వెబ్​ డెస్క్​ : తొర్రూరు మున్సిపాలిటీ (Thorrur Municipality) రాజకీయాలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి స్పందించారు. రాబోయే పరిణామాల్లో తొర్రూరు మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీయే కైవసం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం లేదని ఎర్రబెల్లి దయాకర్​ రావు (Errabelli Dayakar Rao) వివరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులే తమ వైపు వస్తున్నారనే భయంతో ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారాలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. మొత్తం 16 మంది వార్డు సభ్యులలో తమ పార్టీకి చెందిన 9 మంది సభ్యులు విజయం సాధించారని, బలం తమకే ఉందని తెలిపారు.

చివరికి ఎక్స్ అఫీషియో ఓట్లను కలుపుకున్నా సరే, కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని గెలుచుకోవడం సాధ్యం కాదని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో (Thorrur Municipality) తమ పట్టును నిరూపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also: వీటికి బదులివ్వండి.. ట్రేడ్​ డీల్​పై ప్రధానికి రాహుల్​ ప్రశ్నలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>