కలం, వెబ్ డెస్క్ : సింగరేణిలో కాంగ్రెస్ దోపిడిని అరికట్టడానికి కొత్తగూడెం కార్పొరేషన్ (Kothagudem Corporation)లో సీపీఐకి మద్దతు ఇస్తామని చెప్పినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. తెలంగాణ భవన్‌లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో జరుగుతున్న దోపిడిని అడ్డుకోవడమే తమ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సింగరేణిని నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. సీపీఐ, కాంగ్రెస్ లు ఇప్పటికే పొత్తులో ఉన్నాయని కొత్తగూడెం మేయర్ పదవిని పంచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు.
అయితే, ఏఐటీయూసీ వంటి సీపీఐకి (CPI) అనుబంధ సంస్థ అలయన్స్ ను ఎందుకు అంగీకరించిందో తెలియదన్నారు. దాని వెనుక ఏ ఒత్తిళ్లు పని చేశాయోనని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాలు, హక్కుల కోసం గతంలో ఎలా పోరాడామో భవిష్యత్తులోనూ అలాగే పోరాడుతామని ఆయన (KTR) స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు 34 చోట్ల హంగ్ ఏర్పడితే ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతూ కౌన్సిలర్లను కిడ్నాప్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
Read Also: ఎన్నికల్లో ఓడిపోయా.. డబ్బు, చీరలు తిరిగిచ్చేయండి!
Follow Us On: Sharechat


