epaper
Friday, January 16, 2026
spot_img
epaper

వైవీ సుబ్బారెడ్డిని విచారిస్తున్న సిట్

తిరుమల(Tirumala) కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy)ని అధికారులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న సిట్ బృందం ఉదయం నుంచే విచారణ కొనసాగిస్తోంది. టీటీడీకి సరఫరా చేసే నెయ్యిలో కల్తీ జరగిందన్న ఆరోపణలపై నమోదు చేసిన కేసులో కీలక ఆధారాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సుబ్బారెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్నను సిట్ విచారించింది. అప్పన్న ఇచ్చిన వాంగ్మూలంలో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అతను చెప్పిన వివరాలపై స్పష్టత కోసం, ఇంకా కొన్ని ఆర్థిక లావాదేవీలు, నిర్ణయాలు, నెయ్యి కొనుగోలు ప్రక్రియలో తీసుకున్న నిర్ణయాలపై సంపూర్ణ సమాచారం సేకరించడానికి సిట్ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

సిట్ అధికారులు నెయ్యి సరఫరా ఒప్పందాలు, సంబంధిత కంపెనీల పాత్ర, వాటికి టీటీడీకి ఇచ్చిన అనుమతులు, నమూనా పరీక్షలు, నాణ్యతా ధ్రువీకరణ వంటి అంశాలపై వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా కొన్ని పత్రాలు, కమ్యూనికేషన్‌ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారన్న సమాచారం ఉంది. ఈ విచారణ రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. మాజీ పీఏ వాంగ్మూలం నేపథ్యంలో సుబ్బారెడ్డిపై ప్రశ్నలు తీవ్రమయ్యాయి. ఈ కేసులో ఏయే నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.

Read Also: నాంపల్లి కోర్టుకు జగన్.. ఎయిర్ పోర్ట్ వద్ద కార్యకర్తల హల్‌చల్

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>