epaper
Wednesday, February 18, 2026
epaper

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై కేసు నమోదు

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (Dharmapuri Arvind)తో పాటు పలువురు బీజేపీ(BJP) నాయకులపై కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ (Nizamabad) నగరంలోని హరి చరణ్ మార్వాడి స్కూల్ పోలింగ్ బూత్‌లోకి నిబంధనలకు విరుద్ధంగా దూసుకెళ్లారని, పోలీసులను దుర్భాషలాడారని వన్ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 132, 223, 296బీ, బీఎన్ఎస్ సెక్ష‌న్‌ 226 తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019, క్రైమ్ నంబర్ 51/26 కింద కేసులు నమోదు చేశారు.

287 పోలింగ్ బూత్‌లో అభ్యర్థిని బయటకు ఎలా పంపిస్తారు అంటూ నిన్న పోలింగ్ జరుగుతుండగా మధ్యాహ్నం ఎంపీ అర్వింద్‌ మార్వాడీ హరి హరి చరణ్ స్కూల్ లో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విధుల్లో ఉన్న తమను దుర్భాషలాడారని పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్‌లు కెమెరాలతో వచ్చి పోలింగ్ సిబ్బందిని సైతం భయభ్రాంతులకు గురి చేశారంటూ అభియోగాలు మోపారు. ఎంపీ అర్వింద్‌తో పాటు (Dharmapuri Arvind) ఏడుగురు బీజేపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి.

Read Also: షాకింగ్​.. మిగిలిన కూల్​ డ్రింక్స్ ని తిరిగి బాటిల్స్ లో​ పోసి అమ్మేస్తున్నారు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>