epaper
Wednesday, February 18, 2026
epaper

డాక్టర్​ శ్రీలీల.. ఎంబీబీఎస్​ పట్టా అందుకున్న నటి

కలం, వెబ్​డెస్క్: డాక్టర్​ అవబోయి యాక్టర్​ అయ్యాను అనే మాట ఫిల్మ్​ ఇండస్ట్రీలో కామన్​. ఆ మాటను నిజం చేశారు నటి శ్రీలీల (Sreeleela). కాకపోతే యాక్టర్​ అయ్యాకే డాక్టర్​ అయ్యారు. ఈ మేరకు ఎంబీబీఎస్​ పట్టాను ఆమె అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్​కు చెందిన శ్రీలీల.. మహారాష్ట్రలోని డీవై పాటిల్​ యూనివర్సిటీలో (DY Patil University) ఎంబీబీఎస్​ మొదటి సంవత్సరం చదువుతుండగానే సినిమాల్లోకి వచ్చారు. మొదట కన్నడ సినిమా ‘కిస్​’తో వెండితెర మీద అడుగుపెట్టారు. తెలుగులో పెళ్లిసందD మొదటి సినిమా. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. అయితే, చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఖాళీ సమయాల్లో చదువుకొని, పరీక్షలు రాస్తూ పాస్​ అయ్యారు. చివరికి డాక్టర్​ పట్టా అందుకున్నారు. కాగా, శ్రీలీల (Sreeleela) తల్లి స్వర్ణలత కూడా డాక్టరే.

Read Also: సంచలనంగా మారిన 42 రూల్స్.. బన్నీ టీమ్ రెస్పాండ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>