బంగ్లాదేశ్‌లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్ని సమయంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు భారత్ షెల్టర్ ఇవ్వడంపై ఆమె తనయుడు సాజిబ్ వాజేద్(Sajeeb Wazed) స్పందించారు. తన తల్లి హసీనా ప్రాణాలను భారత్ కాపాడిందని, ఆ దేశానికి తాను ఎప్పటికూ రుణపడి ఉంటానని అన్నాడు. ఆ నాడు హసీనాకు భారత్ షెల్టర్ ఇవ్వకపోయి ఉంటే ఆమెను హత్య చేయడానికి కుట్రలు జరిగి ఉండేవని వ్యాఖ్యానించాడు. ఇటీవల హసీనాకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో సాజిబ్ స్పందించారు.
భారత్ మా కుటుంబానికి ఎప్పుడూ నమ్మకమైన స్నేహిత దేశంగా ఉందన్నారు. ప్రమాదకాలంలో తన తల్లిని రక్షించినందుకు తాను ఎల్లప్పుడూ భారతదేశానికి, ముఖ్యంగా ప్రధాని మోదీకి రుణపడి ఉంటానని చెప్పారు. ఆమె(Sheikh Hasina) అప్పట్లో బంగ్లాదేశ్‌లోనే ఉండి ఉంటే, మిలిటెంట్లు ఆమె ప్రాణాలను తీసే కుట్రలు చేసే అవకాశం చాలా ఎక్కువ అని పేర్కొన్నారు.
Read Also: ‘ఇండియాను కార్నర్ చేయడానికే హసీనాకు శిక్ష’
Follow Us on : Pinterest

