బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు మరణశిక్ష విధించడం భారత్‌ను కార్నర్ చేయడంలో భాగమేనని జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ వైద్(SP Vaid) అభిప్రాయపడ్డారు. షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె భారత్‌లో రాజకీయ శరణార్థిగా తలదాచుకుంటున్నారు. ఈ సమయంలో ఆమెకు మరణశిక్ష విధించడం కీలకంగా మారింది. ఈ విషయంపై తాజాగా ఎస్‌పీ వైద్ స్పందించారు. ముహమ్మద్ యూనస్ చీప్ పాలిటిక్స్ చేరస్తున్నారని అన్నారాయన. భారత్‌ను కార్నర్ చేయడం కోసమే ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహమ్మద్ యూనస్.. ఆ దేశం నుంచి పారిపోతే.. అల్పసంఖ్యాకులపై తీవ్రవాదులు చేసిన హత్యలకు ఆయన గైర్హాజరీలోనే విచారణ జరిగి శిక్ష విధిస్తే ఎలా ఉంటుంది? అని వైద్ ప్రశ్నించారు. స్వీయ రక్షణకు అవకాశం ఇవ్వకుండా, హత్య కేసుల్లో నేరం నిరూపించి, ఉరిశిక్ష విధిస్తే ఆయనకు ఎలా అనిపిస్తుంది? అని అన్నారు. అదే విధంగా ఇప్పుడు షేక్ హసీనాకు కూడా తనను తాను రక్షించుకోవానికి, తనవైపు వాదన వినిపించుకోవడానికి న్యాయమైన అవకాశం ఇవ్వాలని కోరారు. “భారత్ ఆమెను (షేక్ హసీనాను) అప్పగించదు. భారత ప్రభుత్వ విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. ముందుగా ఆమెకు న్యాయపూర్వకంగా తన వాదన వినిపించే అవకాశం ఇవ్వాలి. తరువాత పరిస్థితిని భారత్ పరిశీలిస్తుంది” అని ఆయన(SP Vaid) స్పష్టం చేశారు.
Read Also: ప్రతిపక్ష నేత హోదాకు నో చెప్పిన తేజస్వీ యాదవ్.. కానీ !
Follow Us on : Pinterest

