మావోయిస్టు అగ్రనేత హిడ్మా(Hidma) కీలక అనుచరుడిని ఏపీ పోలీసులు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం(Ravulapalem)లో తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో భద్రతా బలగాలు అన్ని వైపులా మోహరించారు. ఆ ప్రాంతంలో మావోయిస్టులకు మనుగడ కష్టమైంది. దీంతో వారు ఏపీలోని అటవీ ప్రాంతానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పలు పట్టణాల్లో తలదాచుకుంటున్నారు. తాజాగా రావులపాలెంలో హిడ్మా అనుచరుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాధవిహండా సరోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా మృతిచెందిన విషయం తెలిసిందే. అనంతరం అతడి అనచరులు వివిధ చోట్లకు పారిపోయినట్టు సమాచారం.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాధవిహండా సరోజ్ కొంతకాలంగా కోనసీమ జిల్లాలో సంచరిస్తున్నట్టు సమాచారం. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ అనంతరం ఏపీలోని మావోయిస్టుల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు. రావులపాలెంలో సరోజ్ ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ట్రాక్ చేసి స్పెషల్ టీమ్ ద్వారా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సరోజ్ వద్ద నుంచి కొంత డేటా, పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
సరోజ్ రావులపాలెం(Ravulapalem) వరకు ఎందుకు వచ్చాడు? ఎవరిని కలవాలనుకున్నాడు? జిల్లాలో ఇంకా ఏవరైనా మావోయిస్టు సభ్యులు ఉన్నారా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సరోజ్ ద్వారా మావోయిస్టులకు సంబంధించిన మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది.
Read Also: భారత్‌కు నేనెప్పటికీ రుణపడి ఉంటా: హసీనా కొడుకు
Follow Us on : Pinterest

