epaper
Wednesday, November 19, 2025
epaper

ఆటగాళ్లు చేసిందానికి గంభీర్‌ను అని ఏం ప్రయోజనం: ఊతప్ప

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఓడిపోవడం టీమిండియా ఫ్యాన్స్‌ను తీవ్ర నిరిశాకు గురిచేసింది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 93 పరుగుల దగ్గరే భారత్ కుప్పకూలింది. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు టీమిండియా హెచ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌(Gautam Gambhir)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై టీమిండియా ప్లేయర్ రాబిన్ ఊతప్ప(Robin Uthappa) స్పందించాడు. ఆటగాళ్లు ఆడలేకపోయిన దానికి కోచ్ ఏం చేస్తాడని అన్నాడు. రన్స్ చేయడంలో ప్లేయర్స్ పూర్తిగా విఫలమయ్యారని, అందుకు గంభీర్‌ను దోషిగా చేయడం సమంజసం కాదన్నాడు.

కోల్‌కతా మ్యాచ్ ఫలితంపై గంభీర్‌ను తప్పుపట్టడం సరైంది కాదన్నాడు. బ్యాట్స్‌మెన్ విఫలమైనప్పుడు కోచ్ ఏమి చేయగలడు? అతడు స్వయంగా మైదానంలోకి వచ్చి బ్యాటింగ్ చేయలేడు కదా అని అన్నాడు.. అంతేకాక, గతంలో లక్షల పరుగులు చేసిన రాహుల్ ద్రవిడ్‌ను కూడా ఇదే విధంగా విమర్శించారని గుర్తు చేశారు. అంటే, ఎవరి మీదైనా ఈ విధమైన నిందలు వేయడం సహజమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఊతప్ప(Robin Uthappa).

Read Also: ఇంట్లో పడుకుంటే ఇలా ఉంటది.. టీమిండియాకు గవాస్కర్ చురకలు..

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>