సౌతాఫ్రికా(South Africa)పై తొలి టెస్ట్‌లో భారత్ ఓడిపోవడంపై దిగ్గజ క్రికెటర్ గవాస్కర్(Sunil Gavaskar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశవాళీ క్రికెట్ ఆడకుండా ఇంట్లో పడుకుంటే ఫలితాలు ఇలానే వస్తాయంటూ చురకలంటించారు. సౌతాఫ్రికా స్పిన్ బౌలింగ్‌కు భారత బ్యాటర్లు బెంబేలెత్తడానికి.. వాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడకపోవడమే కారణమని అన్నాడు. ‘‘మన జట్టులో చాలా మంది ప్లేయర్లు దేశవాళీ క్రికెట్ ఆడట్లేదు. వర్క్‌లోడ్ అంటూ ఇంట్లో పడుకుంటున్నారు.
దేశవాళీ క్రికెట్ ఆడితే.. ఈ రకమైన స్పిన్ పిచ్‌లపై ఆడే సత్తా వస్తుంది. ఎందుకంటే దేశవాళీ క్రికెట్ ప్రతి జట్టూ కూడా ప్రాణం పెట్టి ఆడతాయి. పాయింట్ల కోసం చాలా శ్రమిస్తాయి. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్‌లో ర్యాంక్ టర్నర్ పిచ్‌లు ఉంటాయి. కానీ మన ప్లేయర్స్.. దేశవాళీ క్రికెట్‌ను మర్చిపోయారు. అసలు టీమిండియా జట్టులో ఎంతమంది ప్లేయర్లు రంజీ ట్రోఫీ(Ranji) ఆడటానికి ఇష్టంగా ఉన్నారు. ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే వారికి వర్క్‌లోడ్ అనే సాకు ఒకటి దొరికింది’’ అని Sunil Gavaskar విమర్శలు చేశారు.
అయితే సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ప్రత్యర్థి జట్టుకు భారత బౌలర్లు తమ స్పిన్‌తో ఉచ్చు బిగించాలని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. అదే స్పిన్ ఉచ్చులో భారత్ పడింది. దీంతో 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంటే కనీసం వంద పరుగులు కూడా చేయలేకపోయింది భారత్. దీంతో టీమిండియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Read Also: రజనీకాంత్, బాలకృష్ణ లకి అరుదైన గౌరవం
Follow Us on: Youtube

