epaper
Wednesday, February 18, 2026
epaper

కుప్పకూలుతున్న భారత్ బ్యాటర్లు

కలం, వెబ్ డెస్క్:  టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup) ఇండియా, యూఎస్ఏ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్ చేరుతున్నారు. ఆరు ఓవర్లలో కేవలం 46 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయారు. హిట్టర్స్ అనుకున్న వారంతా కూడా ఒకరి తర్వాత ఒకరుగా ఔట్ కావడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఎక్కువ వికెట్లు క్యాచ్ ఔట్లే కావడంతో.. భారత బ్యాటర్లు నిర్లక్ష్యంగా ఆడుతున్నారా అన్న అనుమానం కూడా కలుగుతోంది. తిలక్ వర్మ ఔట్ కావడంతో క్రీజ్‌లోకి వచ్చిన శివమ్ దూబే.. గోల్డెన్ డక్ అయ్యాడు. తొలి బంతినే గాల్లోకి లేపి క్యాచ్ ఔట్ అయ్యాడు.

షాడ్లీ వేసిన ఆరో ఓవర్లోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆ ఓవర్లో రెండో బంతికి ఇషాన్ 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇషాన్ క్యాచ్‌ను మిలింద్ పట్టాడు. ఆ తర్వాత ఐదో బంతికి తిలక్ వర్మ 25 పరుగుల దగ్గర మోనాంక్ క్యాచ్‌తో పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాతి బంతికే శివమ్ దూబే డకౌట్ అయ్యాడు. దీంతో ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌పై (Suryakumar Yadav) ఒత్తిడి పెరుగుతోంది.

Read Also: ఫైనల్‌కు ముందు నిద్ర పట్టలేదు: వైభవ్ సూర్యవంశీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>