కలం, నల్లగొండ బ్యూరో : తాగిన మైకంలో ఓ టీచర్ ఐదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ప్రధానోపాధ్యాయుడి వద్దకు పిలిపించి అడిగితే.. ప్రజలకు ఎదురుతిరిగాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని గొడకొండ్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో (Godakondla School) చోటుచేసుకుం ది. వివరాల్లోకి వెళితే.. చింతపల్లి మండలం గొడకొండ్ల (వీటి నగర్) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దేవ్లా టీచర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇదే మండలంలోని తక్కెళ్ళపల్లిలో పోస్టింగ్ ఉండగా, డిప్యూటేషన్ పై 20 రోజులుగా వీటి నగర్ స్కూలుకు వస్తున్నాడు.
అయితే దేవ్లా నిత్యం మద్యం మత్తులో పాఠశాలకు (Godakondla School) వచ్చేవాడు. స్కూల్‌లో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇటీవల ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల దేవ్లా అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఉపాధ్యాయుని ప్రవర్తనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో చర్చించారు. అక్కడే ఉన్న ఉపాధ్యాయుడిని ప్రశ్నించగా.. తాను సక్రమంగా ఉన్నానని బుకాయిస్తూ గ్రామ ప్రజలకు ఎదురు తిరిగాడు. దీంతో ఆగ్రహించిన విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్తులు అతనికి పాఠశాలలోనే దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
Read Also: కేసీఆర్ చరిత్ర అంతా అక్రమాలే.. దాన్ని నేను చెరపను : సీఎం రేవంత్
Follow Us On : WhatsApp


