epaper
Wednesday, February 18, 2026
epaper

ఫైనల్‌కు ముందు నిద్ర పట్టలేదు: వైభవ్ సూర్యవంశీ

కలం, స్పోర్ట్స్​ : అండర్ 19 వరల్డ్ కప్ (U19 World Cup)​ విజయంపై చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఫైనల్ మ్యాచ్‌కు ముందు తనకు అసలు నిద్రే పట్టలేదని, తీవ్ర ఒత్తిడికి గురయ్యానని వివరించాడు. తానొక్కడినే కాదని, టీమ్ అంతా కూడా భారీ ఒత్తిడిని ఎదుర్కొందని వివరించాడు. అదే ఒత్తిడిలో భారత్ U19 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఫిబ్రవరి 6న జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 100 పరుగుల తేడాతో గెలిచి ఆరోసారి ట్రోఫీ సాధించింది.

భారత్ విజయంలో వైభవ్ (Vaibhav Sooryavanshi) చేసిన 175 పరుగులు చాలా కీలక పాత్ర పోషించాయి. ఈ సందర్భంగానే తన స్కోర్‌, ఆటతీరుపై కూడా వైభవ్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తాను మైలురాళ్లపై కాదు, దూకుడుపైనే దృష్టి పెట్టినట్టు అతను వివరించాడు. ఫైనల్ ముందు రాత్రి కేవలం గంట లేదా రెండు గంటలే నిద్ర పట్టిందని వైభవ్ చెప్పాడు. భారత్‌లో ఒకే U19 వరల్డ్ కప్ ఆడే అవకాశం మాత్రమే ఉండటంతో ఒత్తిడి ఎక్కువగా అనిపించిందని తెలిపాడు. ఆ అవకాశాన్ని జట్టుగా ఉపయోగించుకున్నామన్న భావనను వ్యక్తం చేశాడు.

లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విజయం భారత్ వైపుకు చేరింది. విజయం తర్వాత తండ్రితో మాట్లాడిన విషయాన్ని వైభవ్ గుర్తు చేశాడు. కలలో సగం పూర్తయ్యిందని, భారత్ సీనియర్ జట్టుకు ఆడటం తదుపరి లక్ష్యమని తండ్రికి చెప్పినట్టు తెలిపాడు. టోర్నమెంట్ మొత్తంలో వైభవ్ 439 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనకు అతనికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో భారత యువ క్రికెట్ మరోసారి తన బలాన్ని చాటింది.

Read Also: సీఎం రేవంత్ ఎప్పటికైనా బీజేపీ మనిషే : కేటీఆర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>