కలం డెస్క్ : ఇప్పటివరకూ తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు సైబర్ క్రైమ్ బాధితులుగా ఉంటే తాజాగా ఆ కోవలోకి సినీ నటుడు అక్కినేని నాగార్జున(Nagarjuna) ఫ్యామిలీ కూడా చేరింది. సైబర్ చీటర్స్ తన కుటుంబంలోని ఒకరిని డిజిటల్ అరెస్టు(Digital Arrest) పేరుతో వేధించారని వెల్లడించారు. డిజిటల్ అరెస్టు పేరుతో ట్రాప్ చేశారని ఆయన స్వయంగా వెల్లడించారు. కొత్త సినిమాల పైరసీ వ్యవహారంలో ఐ-బొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేసిన అనంతరం ఆ వివరాలను హైదరాబాద్‌లోని సినీ పరిశ్రమకు చెందినవారికి వెల్లడించడానికి సిటీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఏర్పాటు చేసిన సమావేశంలో అక్కినేని నాగార్జున ఈ సైబర్ వేధింపుల గురించి ప్రస్తావించారు. సైబర్ కేటుగాళ్ళు డిజిటల్ అరెస్టు పేరుతో తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని వేధించారని తెలిపారు.
Read Also: బెట్టింగ్ యాప్.. చట్టబద్దమన్నాకే ప్రమోట్ చేశానన్న రానా..
Follow Us on : Facebook

