బెట్టింగ్ యాప్‌లకు తాను చేసిన ప్రచారం పూర్తిగా చట్టబద్ధమని హీరో రానా(Rana Daggubati) అన్నారు. ఆయన చేసిన ఈ వాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ అంశంలో సినీ నటులు ఇంకా విచారణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హీరో రానా, యాంకర్ విష్ణుప్రియ.. సీఐడీ విచారణకు హాజరయ్యారు. అయితే ప్రమోషన్స్ చట్టబద్దం అని తెలిసిన తర్వాతనే తాను ప్రమోట్ చేశానని రానా వ్యాఖ్యానించాడు. అతడి మాటలు ప్రస్తుతం కీలకంగా మారింది. ప్రచారం పూర్తిగా చట్టపరంగా సరైనదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే చేశానని రానా స్పష్టం చేశారు. తన లీగల్ బృందం అన్ని పత్రాలు, యాప్ సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే ప్రమోషన్‌లో భాగమైనట్లు తెలిపారు. శనివారం సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ల ప్రకటనల వ్యవహారంపై సీఐడీ సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న సినీ ప్రముఖులను వరుసగా పిలిచి వివరాలు సేకరిస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే రౌడీ హీరో విజయ్ దేవరకొండ, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ను అధికారులు విచారించారు. ఆ తర్వాత రానా(Rana Daggubati), విష్ణుప్రియను సిట్ అధికారులు విచారించారు. సిట్ సూచన మేరకు రానా తన బ్యాంకు లావాదేవీ వివరాలను కూడా సమర్పించినట్టు సమాచారం. రానాను ప్రశ్నిస్తూ—బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో ఏ రకమైన ఒప్పందాలు కుదిరాయి? మీరు పొందిన పారితోషికం ఎంత? ఈ యాప్‌లను ప్రమోట్ చేయడానికి మీకు వచ్చిన ప్రతిపాదన ఎవరి నుండి? ఆ విషయంలో ఏవైనా షరతులు పెట్టారా? అనే అంశాలపై అధికారులు వివరణ కోరినట్టు సమాచారం.
Read Also: ‘ఐబొమ్మ’ క్లోజ్.. వందల హార్డ్ డిస్క్‌లు స్వాధీనం
Follow Us on : Facebook

