epaper
Monday, November 17, 2025
epaper

నటుడు బాలకృష్ణకు సీవీ ఆనంద్ సారీ..

సినీ నటుడు బాలకృష్ణకు తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్(CV Anand) సారీ చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. కొన్ని రోజులుగా సీవీ ఆనంద్‌పై బాలయ్య అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోను సదరు అధికారి అవమానించారని, అందుకు సారీ చెప్పాలని వారు సోషల్ మీడియావేదికగా కోరుతున్నారు. పైరసీపై సీవీ ఆనంద్ నిర్వహించిన సమావేశానికి బాలకృష్ణ(Balakrishna)ను పిలవకపోవడంతో ఈ వివాదం మొదలైంది. ఇది రోజురోజుకు ముదురుతుండటంతో తాజాగా దీనిపై సీవీ ఆనంద్ స్పందించారు.

తాజాగా ఈ వివాదంపై సీవీ ఆనంద్ స్పందించారు. “దాదాపు రెండు నెలల క్రితం చేసిన ఓ ఎమోజీ రిప్లైపై బాలయ్య అభిమానులు, ఆయన యాంటీ ఫ్యాన్స్ పరస్పరం గొడవ పడి నన్ను టార్గెట్ చేసుకొని పోస్టులు చేస్తున్నారని గమనించాను. పని ఒత్తిడి వల్ల నా ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులను ఒక సోషల్ మీడియా హ్యాండ్లర్ చూసేవాడు. సెప్టెంబర్ 29న జరిగిన ప్రెస్ మీట్ తర్వాత వచ్చిన ఆ కామెంట్‌కు అతడు నవ్వు ఎమోజీ పోస్టు చేశాడు. అది పూర్తిగా తప్పు. అతను అలా చేయకూడదు. నాకు ఈ విషయం తెలియకపోవడంతో ఇప్పటివరకు స్పందించలేదు. విషయం తెలిసిన వెంటనే ఆ రిప్లైని తొలగించాను. బాలయ్యకి వ్యక్తిగతంగా మెసేజ్ పంపి పరిస్థితిని వివరించాను. ఆయనకు ఏవైనా బాధ కలిగించి ఉంటే హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాను. చిన్నప్పటి నుంచి బాలయ్య, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సినిమాలు చూసి పెద్దయ్యాను. అందరితోనూ నాకు మంచి అనుబంధం ఉంది’’ అని ఆయన వివరించారు. అంతేకాకుండా తన సోషల్ మీడియా ఖాతాలను చూసుకున్నవ్యక్తిని గతంలోనే తొలగించానని చెప్పారు. అందుకే ఇప్పుడు తన ఖాతాలో పోస్టులు, రిప్లైలు చాలా తగ్గాయని, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని కోరారు.

అసలు వివాదం ఏంటంటే..

ఇటీవల తెలుగు సినిమాల్లో పెరుగుతున్న పైరసీని అరికట్టేందుకు సీవీ ఆనంద్(CV Anand) హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని, నాగచైతన్య, దిల్ రాజు వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీనిని సీవీ ఆనంద్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆ పోస్టుకు ఓ నెటిజన్, “ఈ మీటింగ్‌కి బాలకృష్ణను కూడా పిలవాలి, లేనిపక్షంలో ఆయన ఏపి అసెంబ్లీలో ప్రశ్నిస్తారు” అని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీనికి సీవీ ఆనంద్ నవ్వుతున్న ఎమోజీతో స్పందించాడు. ఈ ఒక్క ఎమోజీ బాలయ్య అభిమానుల్లో ఆగ్రహం రేగేలా చేసింది. దాంతో వివాదానికి బీజం పడింది.

Read Also: నా ఫ్యామిలీ మెంబర్‌కు సైబర్ షాక్ : అక్కినేని నాగార్జున

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>