epaper
Wednesday, February 18, 2026
epaper

దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదు.. రాజ్యసభలో మోడీ

కలం, వెబ్​ డెస్క్ : దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. బడ్జెట్ పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో (Rajya Sabha) ప్రధాని ప్రసంగించారు. విపక్షాల నిరసనల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా అడ్డు తగిలిన విపక్ష సభ్యులకు ముందు తనను మాట్లడనివ్వాలంటూ సూచించారు. తన వయసు దృష్ట్యా కూర్చొని నిరసన తెలపాలని కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను మోడీ ఎద్దేవా చేశారు.

గతంలో ఇతర దేశాలు భారత్​ తో ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకొచ్చేవి అని, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు కూడా మనదేశంతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని మోడీ గుర్తు చేశారు. బీజేపీ హయాంలో అనేక సంస్కరణలు జరిగాయని, ఎన్డీఏ హయాంలోనే భారత్​ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని ఆయన (PM Modi) వెల్లడించారు.

Read Also: నాలుగు వారాల్లో కంప్లీట్ చేయండి.. డీజీపీ నియామకంపై ‘సుప్రీం’

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>