కలం, వెబ్ డెస్క్: రీల్స్ పిచ్చితో యువత ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లైకుల కోసం విచ్చిలవిడిగా రీల్స్ చేస్తూ ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు రీల్స్ పిచ్చితో హైదరాబాద్ (Hyderabad)లో ఓ రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు. అతని మీద నుంచి రైలు వెళ్తుంది. రైలు వెళ్లగానే వెంటనే ఆ యువకుడు ఏదో సాధించినట్టు ఎగిరి గంతులేస్తాడు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు.
” హీరోగా కనిపించేందుకు ఇలాంటి రీల్స్ చేస్తున్నారు. కానీ ఇది నిజంగా మూర్ఖత్వం. తప్పు జరిగితే ప్రాణాలు పోతాయి. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ ట్వీట్ చేశారాయన. ప్రస్తుతం ఈ వీడియో (Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్స్ యువకుడి చర్యపై మండిపడుతున్నారు. ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలు చిన్న పిల్లలపై చెడు ప్రభావం చూపుతాయని, కఠినంగా శిక్షించాలని హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఇటీవల ఒక యువకుడు రీల్స్ కోసం డేంజరస్ స్టంట్ చేసినట్టు పోలీసులు చెప్పారు.
“వైరల్ మోజులో చేసే విన్యాసాలు సాహసాలు కావు.. అవి ప్రాణాల మీదకు తెచ్చుకునే మూర్ఖపు చేష్టలు! ఒక్క సెకను అజాగ్రత్త చాలు, నిండు ప్రాణం గాలిలో కలిసిపోవడానికి. సోషల్ మీడియా లైక్స్ కోసం జీవితాన్ని పణంగా పెట్టకండి.”: సీపీ సజ్జనార్.
రైలు పట్టాల మధ్యలో బోర్లా పడుకుని ప్రమాదకర స్టంట్ చేసిన… pic.twitter.com/HO0HZDoL82— Kalam Daily (@kalamtelugu) February 3, 2026
Read Also: ఆస్ట్రేలియాతో టీ20.. పాక్ కీపర్ తప్పిదంతో తీవ్ర వివాదం
Follow Us On: X(Twitter)


