అమెరికా-ఇండియా ట్రేడ్ డీల్.. రష్యా కీలక వ్యాఖ్యలు

కలం, డెస్క్ : అమెరికా-ఇండియా ట్రేడ్ డీల్ పై తాజాగా రష్యా (Russia) స్పందించింది. తమ దేశం నుంచి చమురు కొనుగోళ్లు నలివేస్తామని ఇండియా చెప్పలేదని రష్యా వెల్లడించింది. రష్యా నుంచి కొనుగోళ్లు ఆపేస్తున్నట్టు గానీ.. వెనెజువెలా నుంచి చమురు కొంటున్నట్టు గానీ భారత్ తమతో చెప్పలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి స్పష్టం చేశారు. ఇండియాతో వాణిజ్యానికే రష్యా అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని.. రెండు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యం పెరిగేలా సహకరిస్తామన్నారు క్రెమ్లిన్.

కాగా నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎక్స్ లో పోస్టు చేస్తూ.. రష్యా (Russia) నుంచి చమురు కొనుగోళ్లు ఆపేందుకు ఇండియా ఒప్పుకున్నట్టు ప్రకటించారు. అమెరికా లేదా వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్లు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. దీనిపై ఇండియా కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు. రష్యా నుంచి ఆపేస్తామని కేంద్రం కూడా బయటపెట్టలేదు. దీంతో ఈ విషయంపై గందరగోళం నెలకొంది. త్వరలో ఎలాంటి ప్రకటనలు బయటకు వస్తాయో చూడాలి.

Read Also: KCR ఎంక్వయిరీ టైమ్‌లో సంతోష్ లేడెందుకు? బీఆర్ఎస్‌లో ఆసక్తికర చర్చ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>