Mobile Popup Ad
Mobile Popup Ad

రీల్స్ పిచ్చితో రైల్వే ట్రాక్‌పై పడుకున్న యువకుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే!

కలం, వెబ్ డెస్క్: రీల్స్ పిచ్చితో యువత ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లైకుల కోసం విచ్చిలవిడిగా రీల్స్ చేస్తూ ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు రీల్స్ పిచ్చితో హైదరాబాద్‌ (Hyderabad)లో ఓ రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు. అతని మీద నుంచి రైలు వెళ్తుంది. రైలు వెళ్లగానే వెంటనే ఆ యువకుడు ఏదో సాధించినట్టు ఎగిరి గంతులేస్తాడు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు.

” హీరోగా కనిపించేందుకు ఇలాంటి రీల్స్ చేస్తున్నారు. కానీ ఇది నిజంగా మూర్ఖత్వం. తప్పు జరిగితే ప్రాణాలు పోతాయి. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ ట్వీట్ చేశారాయన. ప్రస్తుతం ఈ వీడియో (Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్స్ యువకుడి చర్యపై మండిపడుతున్నారు. ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలు చిన్న పిల్లలపై చెడు ప్రభావం చూపుతాయని, కఠినంగా శిక్షించాలని హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఇటీవల ఒక యువకుడు రీల్స్ కోసం డేంజరస్ స్టంట్ చేసినట్టు పోలీసులు చెప్పారు.

Read Also: ఆస్ట్రేలియాతో టీ20.. పాక్ కీపర్ తప్పిదంతో తీవ్ర వివాదం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>