epaper
Friday, January 16, 2026
spot_img
epaper

పవన్ కల్యాణ్‌లా చిరాగ్ పాశ్వాన్ .. స్ట్రైక్ రేట్ 100 శాతం !

గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొంది 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో బీహార్‌లో‌నూ చిరాగ్ పాశ్వాన్(Chirag Paswan) ఇదే తరహాలో స్ట్రైక్ రేట్ కనబరుస్తున్నారు. పోటీ చేసిన మెజార్టీ స్థానాల్లో ఆయన లీడింగ్‌లో దూసుకుపోతున్నారు. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్ జేపీ దాదాపు 29 స్థానాల్లో పోటీ చేయగా 22 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకెళ్తున్నట్టు తెలుస్తోంది.

2020 ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్(Chirag Paswan), తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ వారసుడిగా, ఎన్‌డీఏ(NDA) నుంచి విడిపోయి స్వతంత్రంగా పోటీ చేశారు. ముఖ్యమంత్రి నీతీష్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ 137 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపారు. అయితే కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచారు. ఈ పోటీ జేడీయూ ఓట్లను చీల్చడంలో కీలక పాత్ర పోషించి, నీతీష్ పార్టీ సీట్లు 71 నుంచి 43కి పడిపోవడానికి కారణమైంది.

కానీ, 2024 లోక్‌సభ ఎన్నికలు మలుపు తిరిగాయి. ఎన్‌డీఏలో మళ్లీ చేరిన చిరాగ్, 5 స్థానాల్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్‌తో అన్ని సీట్లు గెలుచుకున్నారు. ఇది బీజేపీతో మళ్లీ బంధం బలపడటానికి, చిరాగ్‌ ను క్యాబినెట్ మంత్రిగా (ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ) చేర్చడానికి దారితీసింది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ షేరింగ్ చర్చల్లో చిరాగ్ 29 సీట్లు (బీజేపీ, జేడీయూ తరచూ 101 చొప్పున) పొందారు. తాజా ట్రెండ్స్ ప్రకారం దాదాపు 23 స్థానాల్లో ఆయన ఆధిక్యతను కనబరుస్తున్నారు. సామాజికసమీకరణాలు, యువత బలం ఆయనను గెలుపువైపు నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.

Read Also: బీహార్ సీఎం ఎవరు..?

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>