epaper
Tuesday, November 18, 2025
epaper

బీహార్ సీఎం ఎవరు..?

బీహార్ సీఎం(Bihar CM) ఎవరు అనే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇప్పటి వరకు ఎన్‌డీఏ కూటమి నుంచి సీఎం అభ్యర్థిపై క్లారిటీ రాకపోవడమే ఈ చర్చకు దారితీసింది. ఈసారి కూడా నితీష్ కుమార్ సీఎం అవుతారని పలువురు భావిస్తున్నారు. కానీ విశ్లేషకులు మాత్రం మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్‌డీఏ కూటమి ఆది నుంచి ఆధిక్యం కనబరుస్తూ వచ్చింది. భారీ మెజారిటీతో దూసుకెళ్తోంది. మొత్తం 243 స్థానాలు ఉండగా 203 మూడు స్థానాల్లో ఎన్‌డీఏ ముందంజలో ఉంది. ఉదయం జేడీయూ “మళ్లీ నీతీశ్‌కుమారే సీఎం” అన్న పోస్టు షేర్ చేసింది. కానీ కొద్దిసేపటికే ఆ పోస్టును తొలగించడం రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలకు కారణమైంది.

జేడీయూ వరుసగా పోస్ట్‌లు చేస్తూ, నీతీశ్‌కుమార్(Nitish Kumar) ప్రభుత్వం మరోసారి ఏర్పడబోతోందని, బిహార్‌ మళ్లీ మంచి పాలనకు సిద్ధమవుతోందని ప్రచారం చేసింది. “నీతీశ్‌ కుమార్ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించారు, ప్రస్తుతం నిర్వర్తిస్తున్నారు, భవిష్యత్తులో కూడా కొనసాగుతారు” అన్న మరో పోస్టు కూడా చేసింది. అయితే దీనిని కొద్దిసేపటికే డిలీట్ చేయడం అందరినీ ఆలోచనల్లో పడేసింది.

Bihar CM | ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించలేదు. అయితే, నీతీశ్ నాయకత్వమే కొనసాగుతుందని స్పష్టంగా చెప్పింది. ఇదిలా ఉండగా, ఉపముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరీ(Samrat Choudhary) గురించి బీజేపీ ప్రధాన నేత అమిత్‌షా ప్రచార సభల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చాయి. సామ్రాట్‌కు ఓటేయాలని కోరుతూ, భవిష్యత్తులో ప్రధాని మోదీ ఆయనను “పెద్ద నాయకుడిగా… చాలా పెద్ద నాయకుడిగా” నిలబెడతారని అమిత్‌షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు అసలు అంతర్లీన ఉద్దేశం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Read Also: నిజాయితీగా పోరాడాం.. జూబ్లీ ఫలితాలపై కేటీఆర్

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>