జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో తనపై కొందరు చేసిన దుష్ప్రచారానికి నియోజకవర్గ ప్రజలే సమాధానం ఇచ్చారని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav) అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,771వేల ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. జూబ్లీహిల్స్ నుంచి గెలుపొందినట్లుగా రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా తన విజయంపై నవీన్ యాదవ్ స్పందించారు.
తాను విజయం సాధించడానికి సహకరించిన కాంగ్రెస్ నాయకత్వం, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలకు నవీన్ యాదవ్(Naveen Yadav) కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు నాపై విశ్వాసం పెట్టి గెలిపించారు, ఇప్పుడు అందరం కలసి మా ప్రాంత అభివృద్ధి కోసం పని చేస్తామని ఆయన అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రగతి చూపించకుండా, కేవలం తనపై దుష్ప్రచారం చేసి గెలిచే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. కానీ ప్రజలు వారి తప్పుదారి ప్రయత్నాలను ఓటు ద్వారా తిరస్కరించారన్నారు.
తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్న నవీన్ యాదవ్.. నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తాను అని హామీ ఇచ్చారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చాయి.
Read Also: సెంటిమెంట్ వర్సెస్ డెవలప్‌మెంట్
Follow Us on : Pinterest

