కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి (Ambati Vijayalakshmi) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనతో పాటు సుమారు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తమకు తీవ్రమైన శాంతి భద్రతల సమస్య ఉందని, ప్రాణహాని కలిగే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమకు 24 గంటల పాటు నిరంతర పోలీసు రక్షణ కల్పించాలని విజయలక్ష్మి కోర్టును కోరారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె తన పిటిషన్‌లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.


