epaper
Saturday, January 31, 2026
spot_img
epaper

నేను చంద్రబాబును తిట్టలేదు.. వాళ్లనే తిట్టా : అంబటి రాంబాబు

కలం, డెస్క్ : సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి అంబటి రాంబాబుపై (Ambati Rambabu) కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా అంబటి రాంబాబు స్పందించారు. తాను తిట్టింది సీఎం చంద్రబాబును కాదని.. తనను తిట్టిన వారినే తిట్టానంటూ వెల్లడించారు. తనను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టినందుకే ఫ్రస్ట్రేషన్ లో వాళ్లను తిట్టానని.. మధ్యలో సీఎం చంద్రబాబు పేరు వచ్చింది తప్ప.. ఆయన్ను తిట్టాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని.. అందుకే టీడీపీ వాళ్లు అలా రెచ్చిపోతున్నారంటూ తెలిపారు అంబటి రాంబాబు.

‘నన్ను అరెస్ట్ చేయాలంటూ సీఎం చంద్రబాబు డీజీపీని ఆదేశించినట్టు నాకు తెలిసింది. అరెస్టులకు నేను భయపడను. నా ఇంట్లోనే ఉంటా. ఎప్పుడైనా వచ్చి అరెస్ట్ చేయండి. నా అనుచరులను కూడా సైలెంట్ గా ఉండమని చెబుతా. అంతే తప్ప సీఎం చంద్రబాబును తిట్టాల్సిన అవసరం నాకు లేదు. సీఎంను రాజకీయంగా విమర్శిస్తా. ఇప్పుడు వివరణ ఇవ్వడానికి కారణం కూడా నా అంతరాత్మనే. అంతే తప్ప ఎవరో బెదిరిస్తే మీడియా ముందుకు రాలేదు. ఏపీలో రెడ్ బుక్ రూల్స్ నడుస్తున్నాయి. నన్ను కొట్టడానికి వస్తే పోలీసులు వారిని అడ్డుకోలేదు. ఇలాంటివి ఎన్ని అయినా ఎదుర్కుంటా’ అని తెలిపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.

అసలేమైందంటే..?

తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని.. కూటమి నేతలు చేసిన తప్పుడు ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది. అటు టీడీపీ నేతలు మాత్రం నెయ్యిని కల్తీ చేశారని వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే మహాపాపం అంటూ మాజీ సీఎం జగన్ అనుచిత ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు కొందరు. దీనిపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి నేతలు మహాపచారం చేశారంటూ అన్ని దేవాలయాల్లో పాప ప్రక్షాళన అంటూ వైసీపీ నేతలు పూజలు చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే గుంటూరులోని గోరంట్లలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) వెళ్లారు. ఆ వివాదస్పద ఫ్లెక్సీని తొలగిస్తానంటూ చెప్పడంతో పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో వివాదం పెద్దదైంది. కొందరు టీడీపీ కార్యకర్తలు మాజీ మంత్రి అంబటి రాంబాబును తిట్టారు. దీంతో అంబటి కూడా తిట్టడం.. మధ్యలో సీఎం చంద్రబాబు పేరు రావడంతో వివాదం కాస్త పీక్స్ కు వెళ్లిపోయింది. సీఎం చంద్రబాబును మాజీ మంత్రి అంబటి రాంబాబు తిట్టారని టీడీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ వివాదంపై అంబటి రాంబాబు పై విధంగా స్పందించారు.

Read Also: కుప్పంలో చరిత్ర సృష్టించాం : సీఎం చంద్రబాబు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>