కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు(Gold Silver Prices) దారుణంగా పడిపోయింది. ఒక్క రోజులోనే రూ.19 వేలకు పైగా తగ్గిపోయింది. శుక్రవారం రూ.1,69,403గా ఉన్న బంగారం ధర శనివారానికి రూ.19,750 తగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్(Global Markets)లో తులం బంగారం ధర రూ.1,49,653గా ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. కిలో వెండి ఒక్క రోజే ధర రూ.1,07,970 పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,91,922గా ఉంది. బంగారం ధర 11 శాతం పడిపోగా, వెండి ఏకంగా 34 శాతం పడిపోయింది.
వెండి ధర రెండు రోజుల్లోనే 50 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది. ఈటీఎఫ్(ETF) భారీ నష్టాల బాటలో ఉంది. అమ్మేవారు తప్ప కొనే వారు లేకపోవడంతో నష్టాలు చవిచూస్తున్నారు. అయితే దేశీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనంగా ఉండటంతో అంతర్జాతీయ ధరల (Gold Silver Prices) తగ్గుదల ప్రభావం పూర్తిగా దేశీయ మార్కెట్‌లో కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. దేశంలో పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: యాదాద్రిలో గోల్డ్ స్కామ్ కేసు.. ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
Follow Us On: Sharechat


