epaper
Monday, November 17, 2025
epaper

పాక్ నుంచి యూటర్న్ తీసుకున్న లంక ప్లేయర్లు..

పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక టీమ్ నుంచి ఎనిమిది మంది ప్లేయర్లు(Sri Lankan Players) యూటర్న్ తీసుకుని స్వదేశానికి వెళ్లిపోయారు. అక్కడ భద్రతా అంశాల కారణంగానే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాక్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్ కొనసాగుతుందా లేదా అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇస్లామాబాద్‌లో బాంబు పేలి 12 మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే తమ భద్రతపై అనుమానం వ్యక్తం చేశారు శ్రీలంక ప్లేయర్లు. శ్రీలంక క్రికెట్ వర్గాలు కూడా తమ జట్టు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ కారణంగానే ఎనిమిది మంది లంక ప్లేయర్లు స్వదేశానికి బయలుదేరారు.

Sri Lankan Players | ఈ కారణంగా గురువారం రావల్పిండిలో జరగాల్సిన వన్డే మ్యాచ్‌ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వన్డే సిరీస్ తర్వాత శ్రీలంక.. పాక్‌లో ముక్కోణపు సిరీస్‌లో కూడా పాల్గొనాల్సి ఉంది. జింబాబ్వే, శ్రీలంక, పాక్ మధ్య ఈ సిరీస్ జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ సిరీస్ కూడా జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి. పాక్, లంక మధ్య జరగాల్సిన మూడో వన్డే.. రావల్పిండిలో జరగాల్సి ఉంది. బాంబు పేలిన ఇస్లామాబాద్‌కు రావల్పిండి సమీపంలోనే ఉండటంతోనే భద్రతా ప్రమాణాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Read Also: ముగిసిన షట్ డౌన్.. ఆ ఫైలుపై ట్రంప్ సంతకం

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>