బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(Dharmendra) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యల కారణంగా ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఆయన అనారోగ్యం గురించి తెలియడంతో బాలీవుడ్ ప్రముఖ నటులు ఆసుపత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు. అయితే ఈ క్రమంలోనే ధర్మేంద్ర చనిపోయారంటూ వార్తలు భారీగా ప్రచారమయ్యాయి. అయితే ఆ వార్తలన్నీ అవాస్తవాలను ధర్మేంద్ర భార్య హేమమాలిని, ఆయన కూతురు అధికారికంగా ప్రకటించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు బుధవారం ఉదయం ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆయన డిశ్చార్జ్ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. ‘‘ఆయనకు ఇంటి వద్దే చికిత్స అందించాలని కుటుంబం నిర్ణయించుకుంది. దాంతో బుధవారం ఉదయం 7:30కు డిశ్చార్జ్ చేశాం’’ అని వైద్యులు వెల్లడించారు.
అక్టోబర్ 31 నుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. ఇంతలో ధర్మేంద్ర(Dharmendra) ఇకలేరంటూ అనేక వార్తలు ప్రచారం అయ్యాయి. ఆ వార్తలపై ఆయన కుటుంబీకులు క్లారిటీ ఇచ్చారు. అయితే అవతన్నీ తప్పుడు వార్తలను తెలియడంతో ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. అంతేకాకుండా ఇటువంటి తప్పుడు ప్రచారాలు జరగకుండా నిలువరించడం కోసం ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని, ఈ ఒక్క అంశంలోనే కాకుండా అనేక విషయాల్లో తప్పుడు సమాచార ప్రచారం అనేక అనర్థాలకు దారితీస్తోందని నెటిజన్స్ అంటున్నారు.
Read Also: తోట తరణికి అత్యున్నత గౌరవం
Follow Us on: Youtube

