ఏపీలోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై దూసుకెళ్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టి(Car Accident) సర్వీసు రోడ్డులో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా .. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
విజయవాడ, కుందేరు గ్రామాలకు చెందిన నలుగురు స్నేహితులు కారులో విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్నారు. గండిగుంట సమీపంలో సమయంలో కారు అదుపు తప్పింది. వాహనం రోడ్డును దాటి సర్వీసు రోడ్డులోకి పడి పల్టీలు కొట్టింది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తీవ్రంగా దెబ్బతిన్న కారులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో చికిత్స పొందుతూ మరణించాడు.
ప్రమాద(Car Accident) స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. అతివేగమే ఈ ఘటనకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల కుటుంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి. గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు.
Read Also: ఢిల్లీ ఘటనపై మోడీ స్పందన ఇదే..
Follow Us on: Youtube

