epaper
Tuesday, November 18, 2025
epaper

త్వరలో పుతిన్ భారత్ పర్యటన.. కీలక ఒప్పందాలు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(Vladimir Putin) ఈ డిసెంబరులో భారత్‌ పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. రష్యా ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం, ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య కార్మికుల మార్పిడి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. రష్యాలో భవన నిర్మాణం, ఇంజినీరింగ్‌, జౌళి, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో నిపుణుల కొరత ఉన్నందున, భారత కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్చలు సాగుతున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే 70వేల మందికి పైగా భారతీయులు రష్యాలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని సమాచారం. పుతిన్‌ పర్యటన సమయంలో ఇంధన, రక్షణ, సాంకేతిక రంగాల్లో కూడా కొత్త ఒప్పందాలు కుదరనున్నట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపర్చడం ఈ పర్యటన లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi), పుతిన్‌(Vladimir Putin) గత ఏడాది రెండుసార్లు భేటీ అయ్యారు. జూలైలో మోదీ రష్యా శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. అక్టోబర్‌లో బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా రష్యాలోని కజన్‌లో మళ్లీ సమావేశమయ్యారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశంలో కూడా వీరిద్దరూ పలు అంశాలపై చర్చించారు. ఈ పర్యటనతో భారత్‌(Bharat)–రష్యా(Russia) సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: హైదరాబాద్‌లో ఉగ్రవాది అరెస్ట్.. భారీ కుట్ర భగ్నం

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>