epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రం భగ్నం

జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)లో పోలీసులు భారీ ఉగ్రకుట్రం భగ్నం చేశారు. ఆ రాష్ట్రంలో ఉగ్రవాదం చాపకింద నీరులా ప్రవేశిస్తుందన్న సమాచారంతో ఇంటెలిజెన్స్, భద్రతా బలగాలు గట్టి నిఘా పెట్టాయి. వైద్య వృత్తి ముసుగులో టెర్రరిస్టులు భారీ ఉగ్రకుట్రకు తెరలేపారు. దేశవ్యాప్తంగా విధ్వంసకర దాడులకు ప్లాన్ చేశారు. దీన్ని పోలీసులు ఛేదించారు.

డాక్టర్‌ ఆదిల్‌ అరెస్టుతో ఆరంభమైన దర్యాప్తు

ఇటీవల అనంతనాగ్‌ జిల్లాలోని మెడికల్‌ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్‌ ఆదిల్‌ అహ్మద్‌(Dr Adil Ahmad) కార్యకలాపాలపై నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి. జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థకు మద్దతుగా పోస్టర్లు అంటిస్తుండడాన్ని గుర్తించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి హాస్టల్‌ గదిలో జరిపిన సోదాల్లో ఏకే-47 రైఫిల్, పత్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు లభించాయి. ఈ రైఫిల్‌ సీరియల్‌ నంబర్‌ ఆధారంగా పాత ఉగ్ర ఘటనలతో సంబంధం ఉందేమనని ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించారు.

ఫరీదాబాద్‌ వద్ద భారీ పేలుడు పదార్థాల స్వాధీనం

ఆదిల్‌ విచారణలో బయటపడ్డ వివరాల ఆధారంగా దర్యాప్తు బృందాలు ఫరీదాబాద్‌ వైపు దృష్టి సారించాయి. అక్కడ మరో వైద్యుడు ముజాహిల్‌ షకీల్ ఇంటిపై దాడి చేసి 360 కిలోల పేలుడు పదార్థాలు, ఒక అసాల్ట్‌ రైఫిల్‌, రిమోట్లు, టైమర్లు, రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. మొదట ఇవి ఆర్డీఎక్స్‌ అనుకున్నారు. అయితే ఫరీదాబాద్‌ సీపీ సతేందర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. “ఇవి ఆర్డీఎక్స్‌ లాగే అధిక ఉష్ణోగ్రతలో మండే రసాయనాలు. ఇవి కూడా విపరీతంగా ప్రమాదకరమైనవే” అని తెలిపారు.

వైద్యుల ముసుగులో

ఆదిల్‌, షకీల్‌ ఇద్దరూ వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ, వారి వెనుక ఉగ్రవాద భావజాలం ఉన్నట్ుట తెలుస్తోంది. ఈ ఇద్దరు పాకిస్తాన్‌ ఆధారిత ఉగ్ర సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరిపి, దేశంలోని పలు నగరాల్లో పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్లు పోలీసులు వెల్లడించారు. వారి కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌, డిజిటల్‌ ట్రేస్‌లను పరిశీలిస్తే మరికొందరు సహచరులు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం వారిని గాలించడం కొనసాగుతోంది.

Jammu Kashmir లో అలర్ట్‌

ఈ ఘటనతో జాతీయ భద్రతా సంస్థలు హై అలర్ట్‌ జారీ చేశాయి. ఫరీదాబాద్‌, ఢిల్లీ, చండీగఢ్‌, జమ్మూకశ్మీర్‌ ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు ప్రారంభించాయి. వైద్యులుగా, విద్యార్థులుగా, ఇంజినీర్లుగా ఉంటున్న కొందరు వ్యక్తులు ఉగ్రవాద సంస్థలకు సాంకేతిక సహకారం అందిస్తున్నారన్నది భద్రతా వ్యవస్థలకు కొత్త సవాల్‌ గా మారింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు ఇటువంటి వారిని టార్గెట్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Read Also: జైళ్లో మందు పార్టీ.. అధికారులు ఏం చేస్తున్నట్టు?

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>