epaper
Tuesday, November 18, 2025
epaper

మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అజారుద్దీన్

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్(Azharuddin).. సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ముస్లిం ప్రార్థనల మధ్య ఆయన బాధ్యతలను తీసుకున్నారు. అయితే అక్టోబర్ 31న అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. అనేక విమర్శల నడుమ.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్.. సోమవారం బాధ్యతలను స్వీకరించారు.

కాగా అజారుద్దీన్‌(Azharuddin)కు మంత్రి పదవి ఇవ్వడం కేవలం ఒక ఎలక్షన్ స్టంట్ మాత్రమే అన్న చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది. అజారుద్దీన్‌కు ఆరు నెలలే సమయం ఉందని, ఈ లోపు ఎమ్మెల్సీ అయినా కాకపోతే ఆయన పదవి ఊస్ట్ అవుతుంది. అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే కాంగ్రెస్ అతనికి మంత్రి పదవి ఇచ్చిందని, మరో ఆరు నెలలు ఆయనను అలా ఉంచి ఆ తర్వాత ఎమ్మెల్సీ కాదు కాబట్టి పదవి పోయినా ఎవరూ ప్రశ్నించరన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Read Also: జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రం భగ్నం

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>