కలం, వెబ్ డెస్క్: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఉచిత పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా కానూరులోని ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తాను ఏ రాజకీయపార్టీలోనేనని.. రాజకీయాలతో తనకు సంబంధం లేదని చెబుతూనే చురకలు అంటించారు. మహిళలకు ఉచిత బస్సు పథకంపై (Free Bus Scheme) వెంకయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఆడవాళ్లకు ఉచిత బస్సు ఎందుకు?
‘ఆడవాళ్లకు ఉచిత బస్సు ఎందుకు? మహిళలను ఊర్లు తిరగమని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదా?’ అంటూ వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) వ్యాఖ్యానించారు. ప్రజలు కట్టే సొమ్ముతో ప్రభుత్వాలు నడుస్తున్నాయని చెప్పారు. కానీ ఆ బ్బుతో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో ఆస్పత్రులు, బడులు నిర్మించాలని కోరారు. అంతేకానీ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఏ ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు విద్య, వైద్యం మీద ఫోకస్ పెట్టాలని కోరారు. వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ మహిళలకు ఉచిత బస్సు పథకాలు అమలవుతున్నాయి. మొదట కర్ణాటకలో ఈ పథకం మొదలుపెట్టారు. దీంతో వెంకయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read Also: స్కూల్ ఆవరణలో తండ్రి శవాన్ని పూడ్చిన వైసీపీ నేత
Follow Us On: Pinterest


