కలం, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవం వేళ మావోయిస్టులు భీకరదాడి (Maoist attack) చేశారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ (Bijapur) జిల్లాలో ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో 11 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఉనికి చాటుకున్నారు. గాయపడినవారిలో 10 మంది జిల్లా రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ) సిబ్బంది కాగా.. ఒకరు సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా కమాండోగా గుర్తించారు. పేలుడు ప్రభావంతో పలువురికి కాళ్లకు తీవ్ర గాయాలయినట్టు సమాచారం.
మావోయిస్టుల దాడిలో (Maoist attack) గాయపడిన భద్రతా సిబ్బందిని వెంటనే రాయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని, దాడికి పాల్పడిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.
Read Also: పెంగ్విన్ ఓపికకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్
Follow Us On : WhatsApp


