కలం, సినిమా : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుంది. “VD14” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా టైటిల్ రివీల్ చేయనున్నట్లు తెలిపారు. రేపు.. ఒక సినిమా కన్నా ఎక్కువ బాధ్యత. మనం అతన్ని పరిచయం చేస్తున్నాం.. అతనితో పాటు, వ్యూహాత్మకంగా దాచిపెట్టిన మన చరిత్రలో ఒక భాగం కూడా వెలువడుతుంది అంటూ విజయ్ (Vijay Deverakonda) ట్వీట్ చేశారు.
Read Also: పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టన్నింగ్ అప్డేట్
Follow Us On: Sharechat


