గ్రామీణ ప్లేయర్లకు హెచ్‌సీఏ తీవ్ర అన్యాయం చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మండిపడ్డారు. ఈ విషయంపై అతి త్వరలో అన్ని నిజాలు బయటపడతాయన్నారు. దీనిపై బీసీసీఐ(BCCI)కి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జూనియర్లు, సీనియర్లను సెలక్ట్ చేస్తున్న హెచ్‌సీఏ(HCA) సెలక్షన్ కమిటీ.. గ్రామీణ ప్లేయర్లను నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై గ్రామీణ ప్లేయర్ల తల్లిదండ్రులు తనను కలిశారని, వారి సమస్యలను తెలుకున్న తర్వాత హెచ్‌సీఐ సెలక్షన్ కమిటీపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. గతంలో బాగా ఆడిన ప్లేయర్లను కూడా హెచ్‌సీఏ సెలక్ట్ చేయడం లేదని తల్లిదండ్రులు తనకు చెప్పినట్లు వెల్లడించారు.
‘‘గ్రామీణ స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పించడం లేదని క్రీడాకారుల తల్లిదండ్రులు నన్ను కలిశారు. హెచ్‌సీఏపై అతిత్వరలోనే చర్యలు ఉంటాయి. బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేస్తాం. సెలక్షన్ కమిటీలో కొందరు.. ప్లేయర్స్‌ను సెలక్ట్ చేయడానికి రూ.లక్షలు అడుగుతున్నారని తల్లిదండ్రులు చెప్పారు. గతంలో బాగా ఆడేవారిని కూడా ఎంపిక చేయట్లేదని ఆరోపించారు’’ అని బండి(Bandi Sanjay) తెలిపారు.
Read Also: కేసీఆర్ పథకాలను నేను ఆపలే: రేవంత్
Follow Us on: Youtube

